మహేష్ తో బిజినెస్ మ్యాన్ లో లిప్ టు లిప్ కిస్ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత బికిని వేసుకుని నటిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆమె ఇలా మాట్లాడింది. అలాగే...తెరపై సెగలు పుట్టించాలంటే అరకొర దుస్తులు ధరించి అందాలు ఆరబోయడమొక్కటే మార్గం అని చాలా మంది భావిస్తారు. కానీ నేను దానికి వ్యతిరేకిని. కేవలం హాట్ గా కనపడి కవ్వించటానికి అదొక్కటే మార్గం కాదంటాను. చక్కటి చీరకట్టుతోనూ యూత్ ని అలరించవచ్చు. బిగుతుగా ఉండే టీ షర్ట్లతోనూ అందంగా కనిపించవచ్చు అంది. అలాగే స్కిన్షోకి నేనెప్పుడూ విరుద్ధమే.
నేను నటించిన సినిమాలు... మా కుటుంబ సభ్యులందరితోనూ కలిసి సౌకర్యవంతంగా చూసేలా ఉండాలి.